ప్రముఖ వ్యాపారివేత ఆత్మహత్య
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రియాంక నగర కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రజిని బాబు (50) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలకు వెళితే….. ప్రియాంక నగర్ లో నివాసముంటున్న రజిని బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇతని కుమారుడు మణిపాల్ గత ఏడాది వినాయక చవితి పండుగ రోజు ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమారుడు చనిపోవడంతో తరచూ తీవ్ర మనో వేదనకు గురి అయ్యేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా వన్ టౌన్ పోలీసులు సమాచారం అందుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని యొక్క భార్య రామాంజనమ్మ ఆ గలిలో ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. తదుపరి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న రజిని బాబు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర దుఃఖానికి లోనయింది. (Story : ప్రముఖ వ్యాపారివేత ఆత్మహత్య)