Home వార్తలు జాతీయం సెప్టెంబర్ 21 నుండి సిపిఐ(మావోయిస్టు) 20వ వార్షికోత్సవాలు

సెప్టెంబర్ 21 నుండి సిపిఐ(మావోయిస్టు) 20వ వార్షికోత్సవాలు

0

సెప్టెంబర్ 21 నుండి సిపిఐ(మావోయిస్టు) 20వ వార్షికోత్సవాలు

న్యూస్‌తెలుగు/చింతూరు: సీపీఐ (మావోయిస్టు) 20వ వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు డివిజన్ వ్యాప్తంగా విప్లవోత్సంతో జరుపుకోండని కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో నడుస్తున్న ఆపరేషన్ కగార్ దాడిని ఓడించడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పడి సెప్టెంబర్ 2024 వరకు 20 సంవత్సరాలు కావస్తున్నది . ఈ రెండు దశాబ్దాల కాలంలో శత్రువు తలపెడుతున్న క్రృరమైన దాడులలో కష్ట, నష్టాలకు ఎదుర్కొని పీడిత ప్రజల విముక్తి కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో విజయాలు సాధించారు.ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం ప్రజా యుద్ధ రంగంలో విరోచితంగా పోరాడుతున్న పిఎల్ జిఎ కమాండర్ లకు ,పార్టీ శ్రేణులకు, యోధులకు, జైల్లో మొక్కవోని దీక్షతో పోరాడుతున్న సహచరులకు, విప్లవ ప్రజానీకానికి, ప్రజాస్వామికవాదులకు, ప్రగతిశీలురకు డివిజన్ కమిటీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)20 వ స్థాపనా దినోత్సవాన్ని సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ప్రజా మీటింగ్ లు, పాటలు, నాటికలు, నృత్యాల ద్వారా ప్రజలను చైతన్య పరచండి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యమయి పోరాడుతూ పార్టీని, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం.
ఈ రెండు దశాబ్దాలలో తెలంగాణా లో మావోయిస్టు పార్టీ శత్రువు యొక్క క్రౄరమైన అణిచివేతను ఎదుర్కొంటూ తీవ్రమైన నష్టాలను చవిచూస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాజకీయ ఉద్యమాలు చేపట్టిఅహర్నిశలు కృషి చేసింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులతో చేసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొడుతూ ఉద్యమాలు చేపట్టింది. ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేపట్టింది. పౌరహక్కుల హననానికి, రాజ్యం హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలను చేసింది. కార్పోరేట్ల అనుకూల ప్రాజెక్టులు, మైనింగ్ లు హరిత హారం, అభయారణ్యం, పోడు భూముల జప్తుకు, ఆదివాసీల స్వయం ప్రతిపత్తి కోసం ప్రజా ఉద్యమాలకు, కార్మికుల, రైతులు, నిరుద్యోగుల, విద్యార్థుల, మహిళల సమస్య కు నాయకత్వం వహించింది.
కాంగ్రెస్ పార్టీమావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ఎల్ ఐ సి వ్యూహాన్ని ఒక పథకం ప్రకారం అమలు చేస్తూనే గ్రీన్ హంట్ దాడులను కొనసాగించింది. బిజెపి 2047 వరకు బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంతో, సమాదాన్, సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది అర్థ సైనిక బలగాలను దించి దాడులను చేసింది. ఈ రెండు దశాబ్దాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాడుల్లో చాలా మందిని హత్య చేసింది. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కగార్ దాడిలో కా.సాగర్ ,కా.మణిరాం,కా..లక్ష్మన్,కా.విజేందర్ ను పొట్టన పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పునర్మించడం కోసం దీర్ఘకాలిక ప్రజా యుద్ధంలో తమ నులివెచ్చని రక్తాన్ని దారపోసినారు. అమరుల నడిచిన బాట మరింత ఎరుపెక్కింది. అమర వీరులు ఆదర్శాలు, కమ్యూనిస్టు విలువలు మనందరికి స్పూర్తినిస్తాయన్నారు. అమరులు కన్న కలలను నిజం చేయడానికి మనమంతా ప్రతినబూనుదాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే విప్లవ ప్రతిఘాతుక పథకాన్ని ఓడించడానికి అన్ని వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాలు చేపట్టాలి. రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడండి.పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడండి. సామ్రాజ్యవాద, దళారి నిరంకుశ బూర్జువా, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యం కండి. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంకండని పిలుపు నిచ్చారు. (Story: సెప్టెంబర్ 21 నుండి సిపిఐ(మావోయిస్టు) 20వ వార్షికోత్సవాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version