మరోసారి దాతృత్వం చాటుకున్న స్పందన హాస్పిటల్ డాక్టర్లు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత కొన్ని రోజుల కిందట విజయవాడలో వరదలు రావడంతో విజయవాడ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతూ తినడానికి తిండి, ఇల్లు లేక పూర్తి కోల్పోవడం జరిగింది. ఈ దిశలో రాష్ట్రంలోని పలువూరు తమవంతుగా సహాయ సహకారాలను అందిస్తు, దాతృత్వమును చాటుకుంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని సాయి నగర్ లో గల స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, భార్య డాక్టర్ సోనియాలు తమవంతుగా రెండు రోజులపాటు విజయవాడకు నేరుగా వెళ్లి తమ దాతృత్వమును చాటుకున్నారు. తొలుత మొదటిరోజు 300 దుప్పట్లను సత్య కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. తర్వాత రెండవ రోజు గన్నవరంలో మెడికల్ క్యాంపులో భాగంగా రోగులు పడుకోవడానికి కప్పుకోవడానికి 500 బెడ్ షీట్స్, 500 బెడ్ స్ప్రైట్స్ ను కలెక్టర్ కార్యాలయంలో అత్యవసరంగా వారు అందజేశారు. అనంతరం డాక్టర్ బషీర్ మాట్లాడుతూ ఇటువంటి సమయాలలో ప్రజలందరూ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ దాతలుగాను సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ కృష్ణ జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించిన ప్రభుత్వానికి అధికారులకు డాక్టర్ బషీర్, సోనియాలు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : మరోసారి దాతృత్వం చాటుకున్న స్పందన హాస్పిటల్ డాక్టర్లు )

