వరద బాధితులకు కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ ఆర్థిక సాయం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గాను తమ వంతుగా జిల్లాలోని ధర్మవరం కళా జ్యోతి సాంస్కృతిక సంస్థ వారు ముఖ్యమంత్రి రిలీజ్ ఫండ్ కొరకు రూ.1,01,116 లు విలువచేసే డిడిని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ, గౌరవ అధ్యక్షులు వెంకటనారాయణ, కార్యదర్శి బి.రామకృష్ణ, ఉపాధ్యక్షులు సింగనమల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థను అభినందించారు. అనంతరం కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ విజయవాడలో ఇటీవల జరిగిన వరద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, అన్ని రకాలుగా పూర్తి దశలో నష్టపోయినందున తమవంతుగా తాము ఆర్థిక సహాయం అందించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, గోరకాటి పెద్దారెడ్డి, పల్లెం వేణుగోపాల్,రాంప్రసాద్, సుందరేశం, రమేష్, రామన్న, పోలా వెంకటనారాయణ, మధుసూదన్, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. (Story : వరద బాధితులకు కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ ఆర్థిక సాయం)