వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జీవీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక నిమ్మల బావి బజార్ లో శ్రీ కందుకూరి అంకమ్మతల్లి దేవస్థానం తరుపున ముదురాజుల కమిటీ సభ్యులు వినాయక చవితి సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మూడవరోజు ఎమ్మెల్యే జివి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావులు ప్రత్యేక పూజలు చేశారు. 5వ వార్షికోత్సవంలో భాగంగా అంకమ్మ తల్లి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బత్తిక దానయ్య, ఒగ్గు శ్రీనివాసరావు, బత్తిక నరసింహారావు, రాఘవమ్మ, లక్ష్మీదేవి, జానకమ్మ, రామలక్ష్మి, మహిళా భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story : వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జీవీ)