24 గంటలూ పనిచేస్తున్న కంట్రోల్ రూమ్ లు
న్యూస్‌తెలుగు/విజయనగరం : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ స్థాయిల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ పనిచేస్తున్నాయి. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ సిబ్బంది జిల్లా వ్యాప్తంగా వర్షాల ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ మండలాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అవసరమైన వారికి తగిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ అధికారులతోపాటు, నీటి పారుదల, పోలీస్, పంచాయితీరాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖల అధికారులు కూడా పనిచేస్తున్నారు. అలాగే విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ఆర్‌డిఓ కార్యాలయాలతోపాటు, అన్ని మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌డి అనిత, జిల్లా విపత్తుల నిర్వహణాధికారి రాజేశ్వరి ఆదివారం పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 08922 236947
విజయనగరం డివిజన్ కంట్రోల్ రూమ్ 08922 276888
బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూమ్ 9390440932
చీపురుపల్లి డివిజన్ కంట్రోల్ రూమ్ 7382286268
(Story:24 గంటలూ పనిచేస్తున్న కంట్రోల్ రూమ్ లు)