గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి : ప్రేమలత
న్యూస్ తెలుగు /ములుగు : గర్భిణీ స్త్రీలు పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలని, ములుగు జిల్లా ఐసిడిఎస్ సిడిపిఓ ప్రేమలత అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం ఐసిడిఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో ప్రైవేట్ హాస్పిటల్ / నర్సింగ్ హెూమ్ వర ప్రసాద రావు వద్ద మరియు యంపియుఎస్ నేతాజీ నగర్, పాఠశాలలో పోషణ మాసం ను పురస్కరించుకొని మహిళకు, పిల్లలకు పోషకారం గురించి అవగాహనా
కల్పించారు.ఈ సందర్బంగా ప్రేమలత మాట్లాడుతూ ఎక్కువగా మహిళలు కిశోర బాలికలు రక్త హీనతకు గురి అవుతుంటారని, హెమోగ్లోబిన్ రక్తాన్ని వృద్ధి చెందించుకునుటకు,ఐరన్ ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా వున్నా రాగి జావా, బెల్లం, అటుకులు, చిరుధాన్యాలు, రోజు వారి ఆహారం లో డైట్ ప్లాన్ చేసుకోవాలని,అలాగే ఆకూ కూరలు, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా భుజించాలని తెలిపారు . అంగన్వాడీ ల ద్వారా అందించే పాలు, గుడ్లు ఒక పుట సంపూర్ణ భోజనం తోపాటుగా, పోషకాహార విద్యను కూడా బాలికలకు,గర్భిణీ లు వినియోగించుకోవాలని సూచించారు. 0-6 సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రాల నుండి అందించే సేవలను పోషకాహారాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యం కలిగి జీవించేలా వారి వారి రోజు తీసుకునే,ఆహార నియమాల పట్లసరైన జాగ్రత్తలు వహించాలని,తద్వారా ఆనారోగ్య బారిన పడకుండా శక్తీ వంత మైన భావి తారలను చూడగలమని తెలిపినారు.
ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సిబ్బంది, కార్యదర్శి,అంగన్వాడీ టీచర్లు మరియు పెద్ద ఎత్తున మహిళలు స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. (Story : గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి : ప్రేమలత)