విజయవాడ వరద బాధితులకు అన్ని రకాల సేవలు అందిస్తాం
పట్టు చీరల తయారీ వ్యాపార సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : విజయవాడ వరద బాధితులకు అన్ని విధాలుగా తమ సహాయ సహకారాలను అందిస్తామని పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, నీలూరి శ్రీనివాసులు, కోశాధికారి కాలవల మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తి వందల సంఖ్యలో మనుషులు పశువులు ఇబ్బంది పడడం జరిగిందని, అంతేకాకుండా వరద సమయంలో పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందని తెలిపారు. ఎంత డబ్బు ఉన్నా, వరద వచ్చిన పరిస్థితిలో మనుషులందరూ ఒక్కటే అన్న ఆలోచనతో వరద బాధితులకు తాము సహాయ సహకారాలు తప్పక అందిస్తామని, ఈనెల 14వ తేదీన వ్యాపారస్తుల తో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ధన రూపేన, ధాన్యము రూపేనా, వస్తు రూపేనా స్వీకరించి, వరద బాధితులకు పంపిణీ చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. కావున వ్యాపారస్తులందరూ కూడా ఏకధాటితో విజయవాడ వరద బాధితులను ఆదుకోవలసిన బాధ్యత అందరిమీద ఉందని వారు తెలిపారు. సమావేశం రోజున వ్యాపారస్తులందరూ కూడా తమకు తోచిన సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బండారు శ్రీనివాసులు, గాండ్ల రామాంజి పల్లా నవీన్, సహాయ కార్యదర్శి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : విజయవాడ వరద బాధితులకు అన్ని రకాల సేవలు అందిస్తాం.. )