విశ్రాంత ఉపాధ్యాయులకు కు ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులు సి.ఎస్. సత్యానంద రెడ్డి, వై వి సుబ్బయ్య శర్మ, టి. సూరి, బాలాజీ సింగ్ లను సంఘ భవనము నందు ఘనంగా సన్మానించారు. భువనగిరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర గురించి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టి శేషయ్య, జి. నాగేంద్రుడు, పి.రాములు, ఏ రామలింగేశ్వర రావు, కృష్ణమూర్తి, రాఘవయ్య, సిహెచ్ రఘు, బిపిఎస్. సుందర్రావు, దుబ్బలదాసు, శేఖర్, వెంకటేశ్వరరావు, రమేష్, హసన్, వైవి సుబ్బారావు, ఆది రాములు, శంకర్రావు, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story : విశ్రాంత ఉపాధ్యాయులకు కు ఘన సన్మానం.)