ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో టీచర్స్ డే వేడుకలు
మానవతా సంస్థ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణములోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో మానవతా సంస్థ వారు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ప్రముఖ వ్యాపారవేత్త ఐటీసీ డీలర్ సూర్యనారాయణ గర్ల్స్ కు కావలసిన సానిటరీ నాప్సికిన్సులు విరాళంగా అందజేశారు. తదుపరి రిటైర్డ్ టీచర్ బాలగుండ్ల రామకృష్ణను, టి నారాయణ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. అనంతరం సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి కార్యదర్శి చిన్నప్ప మాట్లాడుతూ మున్ముందు హాస్టల్కు మరింత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లత, ఉపాధ్యక్షులు జింక చిన్నప్ప, సంయుక్త కార్యదర్శి మంజునాథ్, సభ్యులు వేణుగోపాల్, మనోహర్ గుప్తా, ఆంజనేయ చౌదరి తదితరులు పాల్గొన్నారు. (Story : ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో టీచర్స్ డే వేడుకలు)