వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు
పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా
గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు.
రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ వెల్లడి
న్యూస్‌తెలుగు/రేపల్లె: వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ వరకు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా లంకెవాని దెబ్బ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కృష్ణ నదికి వరదలు వచ్చి నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంపు గ్రామాలను విజయవాడ నుంచి అనుక్షణం పర్యక్షిస్తున్నారని తెలిపారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న వరద బాధిత కుటుంబాలకు మంచినీళ్లు భోజన వసతి పాలు మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన కృష్ణ తీర ప్రాంత ప్రజలకు పెను ప్రమాదం తప్పిందని అన్నారు. కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున వరద వచ్చినా ఆపగలిగేమంటే నాయకులు అధికారుల సమిష్టి కృషి అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద విపత్తుని కుటుంబ సమస్యగా తీసుకొని నాయకులను, అధికారులు అప్రమత్తం చేయడంతో విపత్తు నుంచి బయట పడ్డామన్నారు. అయితే వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాపించే వంటి వ్యాధులు, విష జరాలు, ఇతర అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో పాటు, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధతో పరిసరాలను పరిశుభ్రపరచాలని కోరారు. వరద ముప్పు ప్రాంతాలైన రుద్రవరం, పిరాట్లంక చెనుపల్లివారిపాలెం,గంగడి పాలెం, రాజు కాలువ తీర ప్రాంతమైన లంకెవాని దిబ్బ గ్రామాలను పరిశీలించటం జరిగిందన్నారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నివేదికలను తయారుచేసి సీఎం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. కృష్ణ నది కరకట్టను అప్పటి బ్రిటిష్ వారు నిర్మించారని 150 సంవత్సరాలుగా కరకట్టను పటిష్ట పరచక పోవడంతో, కృష్ణానది తీరప్రాంతాల వెంబడి ఉన్న కర్క అన్నిచోట్ల బలహీన పడిరదని చెప్పారు. కరకట్ట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. తీర ప్రాంత గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాలు లేక రోడ్ల అధనంగా ఉండడం చేత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. గ్రామాలలో కరెంటు పోతే దాదాపు 16 గంటల పాటు విద్యుత్ సౌకర్యం లేక చిన్నారులు మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళతామన్నారు. గ్రామీణ ప్రాంత లాభివృద్ధి తో పాటు వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వైర్లను స్తంభాలను పునర్దరించాలని అధికారులను సూచించారు. లంకెవాని దెబ్బ గ్రామంలో వరద ముంపుకు గురికాకుండా ఉండేందుకు దాదాపు 5 కిలోమీటర్ల మేర సముద్రంలో రిటర్నింగ్ వాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు భవిష్యత్తులో ఎటువంటి వరదలు రాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అనగాని శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పంతాని మురళీధర్ రావు, గూడపాటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు మత్తి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
రొయ్యల చెరువుల పరిశీలన
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లు బాపట్ల జిల్లాలోని ముంపు గ్రామాల్లో పర్యటించారు. రేపల్లె మండలంలోని మైనేనివారిపాలెం ,మొర్తడ ,చట్రగడ్డ గ్రామాల్లో ఉన్న రొయ్యల చెరువులను ఇరువురు మంత్రులు పరిశీలించారు. వరదలకు రొయ్యల చెరువులు ఎలా దెబ్బతిన్నాయో స్థానికంగా ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. జిల్లాలో వరదలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. తద్వారా నష్టపోయిన అన్నదాతలకు పంట నష్టం సాయం అందిస్తామని పేర్కొన్నారు.
అనంతరం మండలంలోని ముంపుగ్రామాల్లో ఒకటైన బొబ్బరలంక వాసులు సుమార్ 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రానికి వెళ్లి మంత్రులు పరిశీలించారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఇరువురు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతీ ఒక్క వరద బాధితునికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (Story : వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు)