UA-35385725-1 UA-35385725-1

మీ కష్టం మాది.. ఆందోళన వద్దు

మీ కష్టం మాది.. ఆందోళన వద్దు

వరద బాధితులకు మంత్రి సవిత భరోసా

న్యూస్‌తెలుగు/అమరావతి : ‘మీకొచ్చిన కష్టం మాది… మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు… చంద్రబాబు ప్రభుత్వం మీ వెంటే ఉంది’ అని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత భరోసా ఇచ్చారు. బుధవారం విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా మంత్రి సవిత 54 డివిజన్ లోని నైజాం గేట్, పూర్ణానంద పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చుకుని, వీధుల్లో, రోడ్లపై చెత్తను, కాలువల్లో పూడికలు తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్లీచింగ్ చల్లాలని, ఫాగింగ్ నిర్వహించాలన్నారు. వరద బాధితులకు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలు, పాలు, తాగునీరు అందించాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి సవిత ఆదేశించారు.
ఇంటింటికీ వెళ్లి భరోసా ఇచ్చి..
అనంతరం 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి మంత్రి సవిత పర్యటించారు. కంసాలి పేట, మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో మోకాలు లోతు నీటిలోనూ ఇంటింటికీ వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మీ కష్టం మీ ఒక్కరిదే కాదని, ఈ రాష్ట్ర ప్రజలదని అన్నారు. సీఎం చంద్రబాబు రాత్రి పగలు… నిద్రాహారాలు మాని విజయవాడ కలెక్టరేట్ లో ఉంటూ కష్టపడుతున్నారన్నారు. ప్రజలు నీటిలో ఉంటున్నారు..మీరెళ్లి ఆహారం, పాలు, బిస్కెట్లు వాటర్ బాటిళ్లు.. ఇతర నిత్యావసరాలు అందించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆదేశించారన్నారు. వారందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, చంద్రబాబు పంపితే మీ ఇంటికొచ్చామని, ఆందోళన చెందొద్దని మంత్రి కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. మీకు అండగా సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ, ఇప్పటికే వరద నీరు తగ్గుముఖం పట్టిందని, సహాయక చర్యలు మరింత ముమ్మరంగా చేపట్టనున్నామన్నారు .
చంద్రబాబుకు ధన్యవాదాలు
ఆహారం, పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందుతున్నాయా..? అని ప్రతీ ఇంటి వద్దకు వెళ్లి మంత్రి ఆరా తీశారు. ఇందుకు స్థానికులు స్పందిస్తూ, ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సమయానికి అన్నీ అందుతున్నాయని, తమకు ఏ లోటూ లేదని సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కష్టంలో అండగా నిలిచిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు మంత్రి సవిత… ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. వరద బాధితుల కోసం తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా ఉపాధ్యక్షులు షేక్ ఆషా, స్థానిక నాయకులు డీవీ సుబ్బారావు, మహ్మద్ జాహీద్, బోను జయశంకర్, పాలేటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి మోకాలు లోతు నీటిలో…
56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వరద సహాయక కార్యక్రమాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ప్రతి వీధిలోకి…ప్రతి ఇంటి వద్దకు మోకాలు లోతు నీటిలో వెళ్లారు. ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు, బిస్కట్లు పంపిణీ చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం భరోసా అందిస్తూ మంత్రి పర్యటన సాగింది. మంత్రి సవిత వరద సహాయక సేవలపై స్థానికులు కొనియాడారు. ఆపత్కాకాలంలో అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. (Story : మీ కష్టం మాది.. ఆందోళన వద్దు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1