వరదల భాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
న్యూస్‌తెలుగు/వినుకొండ : విజయవాడ వరదల భాధితుల సహాయార్ధం తహశీల్దారు కార్యాలయం , వినుకొండ మరియు వినుకొండ మునిసిపాలిటీ కార్యాలయం వారు సంయుక్తంగా కలిసి సుమారు 1,30,000/- రూపాయల విలువగల బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు వినుకొండ మండల కేంద్రం నుండి దాతల సహాయ పంపడమైనది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి, వినుకొండ తహశీల్దారు, వినుకొండ మునిసిపల్ కమీషనర్, వినుకొండ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు. ఈ సహాయ కార్యక్రమంకు సహకరించిన వారు. దిలీప్ కుమార్ ఇండో నాకోప్ కెమికల్స్ లిమిటెడ్, పొట్ల రాధాకృష్ణ మూర్తి వినుకొండ, వినుకొండ, క్రషర్ అసోసియేషన్, వినుకొండ , మాదినేని ఆంజనేయులు ఏనుగుపాలెం, వినుకొండ ఫర్టిలైజర్ అసోసియేషన్ వారు, వినుకొండ దాల్ మిల్ అసోసియేషన్ వారు, నలబోతు రవి అందుగులపాడు, వినుకొండ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ వారు, వినుకొండ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు, వినుకొండ గోల్డ్ షాప్స్ అసోసియేషన్ వార, ములే వెంకటేశ్వర రెడ్డి వినుకొండ, ఇమ్మడిశెట్టి సూరిబాబు ఆంజనేయ విలాస్, పెనుగొండ శ్రీను సహకరించారు.(Story : వరదల భాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ)