కార్యకర్తలకు కష్టం వస్తే కడుపులో దాచుకుంటా
పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పలువురు కార్యకర్తలను,నాయకులను పరామర్శించి ధైర్యం నింపారు అండగా ఉంటానని అధైర్యపడొద్దు అని భరోసా ఇచ్చారు. ఆంజనగిరి గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు, మలిదశ ఉద్యమకారుడు దేవన్న నాయుడు రోడ్ ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకోని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నందిమల్ల.రమేష్ గారు ఇటీవల క్రిందపడి చేయి ఫ్రాక్చర్ అయింది.రమేష్ గారిని పరామర్శించిన ఆయన మెరుగైన వైద్యం కోసం సహకరిస్తానని అన్నారు. శ్రీరంగాపురం మండల కో.ఆప్షన్ సభ్యులు హరీఫ్ గారి తమ్ముడూ ముబీన్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పార్థీవ దేహాన్నికి నివాళ్లు అర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలి అని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అధ్యక్షులు వెంకటస్వామి,వనం.రాములు,గౌడ నాయక్,జగన్నాథ్ నాయుడు,మాజీ Z.P.T.C పద్మా వెంకటేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. (Story: కార్యకర్తలకు కష్టం వస్తే కడుపులో దాచుకుంటా)