UA-35385725-1 UA-35385725-1

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి!

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి!

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/వనపర్తి: వ‌న‌ప‌ర్తి జిల్లాలో భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరుగకుండా మరో రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి అందరూ మండల, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాల వల్ల జరిగిన నష్టాలు, ప్రస్తుతం అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలో భారీ వర్షాలు నమోదు అయిందప్పటికిని ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. మరో రెండుమూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన నష్టాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి రేపు సాయంత్రంలోగా సమర్పించాలని సూచించారు. రోడ్ల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు వేగంగా జరగాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి అందులో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరం అయిన వాటికి నోటీసులు ఇచ్చి కులగొట్టాలని చెప్పారు. ఇప్పటికే వర్షాల వల్ల కూలిపోయిన ఇళ్ల యజమానులు నుండి పరిహారం కొరకు దరఖాస్తులు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పంచనామా, జి.పి.ఎస్ ఫోటోలు తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాల్సినదిగా సూచించారు. రిలీఫ్ క్యాంప్ కు తరలించిన వారికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇకనుండి మంగళవారం, శుక్రవారం వారానికి రెండు రోజులు డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. ప్రజలకు సైతం పారిశుధ్యం, నీరు వేడి చేసి చల్లార్చి తాగడం వంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. (Story: పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1