నియంత పాలన మనకు వద్దు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తిః చెరువుల ఏర్పాటు, వరద కాలువల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పరమైన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం వనపర్తి పట్టణంలోని మర్రికుంట చెరువును ఆయన పరిశీలించారు. ఎలాంటి అవగాహన, ఆలోచన లేకుండా అభివృద్ధి పేరుతో మర్రికుంట చెరువు అభివృద్ధి పేరుతో గత పాలకులు అందిన కాడికి దోచుకొని వదిలేసారని నేడు చెరువు నిండిన వరద నీరు పట్టణంలోని పలు కాలనీలలోకి వచ్చి చేరుతోందని వరద నీరు ఇళ్లల్లోకి, ఇళ్ల మధ్యన నిలవకుండా ఉండేందుకు సత్వర చర్యలు చేపట్టాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అధికారులకు సూచించారు. కట్ట పూర్తిగా పెంచేసి అలుగును మాత్రం తవేశారని, ప్రస్తుతం కురిసే ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన వరద నీళ్లకు చెరువు అలుగుపారి ఇళ్లలోకి చేరడం ప్రజలకు ఇబ్బందిగా ఉందని ఆయన అన్నారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వచ్చే వరద నీటికి సహాక చర్యలల్లో పాల్గొంటే కొంతమంది మాత్రం ఇళ్లల్లోకి చేరే నీళ్లకు పూజలు చేసి పూలు చల్లి సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని సంబరాలు చేసుకున్న మనం ప్రజాసేవలోనే ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రజలకు ఇబ్బంది రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఎంఎల్ఏ సూచించారు. (Story: నియంత పాలన మనకు వద్దు)