UA-35385725-1 UA-35385725-1

ప్రజలు అదైర్యపదొడ్డు..నష్టనివారణ చర్యలు ప్రారంభించాం

ప్రజలు అదైర్యపదొడ్డు..నష్టనివారణ చర్యలు ప్రారంభించాం

🔹 రోడ్లు, విద్యుత్ పునరద్దరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి
🔹 పంట నష్టపై సత్వరమే సర్వేచేపట్టి రైతులను ఆదుకుంటాం
🔹 ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపడతాం
🔹 ఇండ్లు కోల్పోయిన పేదలకు పక్కాగృహాలు, పరిహారంకోసం వత్తిడితెస్తా
🔹 జరిగిన నష్టంపై అధికారులు నివేదికలు సిద్ధం చేసి అందించాలి
🔹 అధికారయంత్రాంగం ముంపు ప్రాంతాలకు పరిమితం కావాలి
👉 కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
🔹 ప్రభుత్వ అధికారులతో పాల్వంచ రూరల్ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కూనంనేని

న్యూస్‌తెలుగు/పాల్వంచ/కొత్తగూడెం : భారీ వర్షాలకు ముంపుగురై ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు అదైర్యపడొద్దని యుద్ధ ప్రాతిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలో వర్షాలు, వరదలకు ముంపుకు గురైన ఉల్వనూరు, మందెరకలపాడు, మల్లారం, కిన్నెరసాని, రాళ్ళవాగు, యానంబైలు ప్రాంతాలను సోమవారం కూనంనేని సందర్శించారు. మండల తహశీల్దార్, ఎంపిడీవో, నీటిపారుదల, వ్యవసాయ, అటవీశాఖ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మందెరకలపాడు వంతెనకు గండి ఏర్పడటంతో సుమారు ఏడువూర్లకు రాకపోకలు స్తంబించడంతో స్పందించిన కూనంనేని అధికారులను ఆదేశించడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. వరద ఉదృతితో నిరుచేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను పరామర్శించి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు, బాదితులకు పరిహారం చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామాలను సందర్శించిన సందర్భంలో దెబ్బతిన్న రోడ్లను, విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. వరదతాకిడికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముందస్తు సమాచారం అందించినప్పటికి గ్రామీల సందర్శనకు గైర్జనరైన వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణపనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వేచేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. పాల్వంచ రూరల్లో జరిగిన ముంపు పరిస్థితులను గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటంతో అధికారులు క్షేత్రస్థాయి సమీక్షలో ఉండాలని, కార్యాలయాలకు పరిమితమై ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టివేయవద్దని సూచించారు. పర్యటనలో కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా, జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాధం, వి.పూర్ణచందర్రావు, ఏ. సాయిబాబు, బండి నాగేశ్వర్రావు, రాహుల్, నాగరాజు, మన్నెం వెంకన్న, ఆదినారాయణ, అన్నారపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు నాగసీతారాములు, బరపటి వాసుదేవరావు, ఎర్రంశెట్టి ముత్తయ్య, తహశీల్దార్ వివేక్, ఎంపిడీవో కె. విజయభాస్కర్, ఎంపీవో బి.నారాయణ, ఇరిగేషన్ శాఖ అధికారి దేవదాస్, చంద్రశేఖర్, రాథోడ్, విద్యత్ శాఖ డీఈ నందయ్య, ఏఈ రవీందర్, పిఆర్డీఈ రామకృష్ణ, ఆర్అండ్ అధికారి డి.నాగేశ్వర్రావు, వ్యవసాయ శఋఖ అధికారి శంభోశంకర, శౠంతి, రూరల్ ఎస్ఐ సురేష్, అటవీశాఖ అధికారి కృష్ణయ్య తదితరులు ఉన్నారు. (Story: ప్రజలు అదైర్యపదొడ్డు..నష్టనివారణ చర్యలు ప్రారంభించాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1