ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పోతుకుంట శివాలయములో చిలకం మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణములో కేకు కట్ చేసిన అనంతరం మొక్కలను నాటారు. తదుపరి దిగువగేరి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, చిన్నూర్ మున్సిపల్ హై స్కూల్, తాడిమర్రి లోని ఆదర్శ పాఠశాల , నార సింపల్లి గ్రామంలో, బత్తలపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో కూడా చిలకం మొక్కలను నాటారు. తదుపరి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు. అదేవిధంగా తాడిమర్రి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. నారా సింహ పల్లి లో అన్నదాన కార్యక్రమాన్ని అనాధాశ్రమంలో నిర్వహించారు. తదుపరి పట్టణంలోని వరలక్ష్మి థియేటర్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్ తో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు)