క్లీన్ ఆంధ్ర .. గ్రీన్ ఆంధ్ర
పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణం లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భముగా మల్ల కాలవ గ్రామం నందు కేక్ కట్ చేసి తదానంతరం జనసేన పార్టీ యువ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. బిజెపి పార్టీ నాయకులు మిర్యాల అంజి మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పిలుపుమేరకు చెట్లు నాటే కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు మిరియాల అంజి జనసేన పార్టీ యువ నాయకులు హర్షవర్ధన్.,నాగరాజు మురళి, రాయలు మిరియాల హరి, అల్లం లోక నాథ్, మనోజ్ కుమార్ , చెన్నకేశవరెడ్డి, ప్రవీణ్ కుమార్, చిన్న, నరేష్,, సురేష్, రాజేష్, బొగ్గు సురేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : క్లీన్ ఆంధ్ర … గ్రీన్ ఆంధ్ర )