5న వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంటు
న్యూస్ తెలుగు/ ధర్మ వరం (శ్రీ సత్య సాయి జిల్లా) : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అటల్ బిహారీ వాజ్పాయ్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల ఐదవ తేదీన పట్టణములోని కాలేజీ గ్రౌండ్, ఆర్డిటి గ్రౌండ్లలో నిర్వహిస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫైనల్స్ క్రికెట్ ఈనెల 16వ తేదీన ఉంటుందని తెలిపారు. ఆసక్తిగల క్రికెట్ క్రీడాకారులు ఎంట్రీ ఫీజు రూ.1000 ఉంటుందని తెలిపారు. కేవలం శ్రీ సత్య సాయి జిల్లా క్రీడాకారులు మాత్రమే ఇందులో పాల్గొనాలని తెలిపారు. ఈనెల మూడవ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. క్రికెట్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి కింద ఒక లక్ష రూపాయలు ఇవ్వబడుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Stroy : 5న వాజ్‌పేయి క్రికెట్ టోర్నమెంటు)