జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమును కలిసిన టూ టౌన్ సీఐ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని టూటౌన్ సీఐ రెడ్డప్ప జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిలక మధుసూదన్ రెడ్డి తన వద్దకు వచ్చిన సీఐను గౌరవంగా శాలువా కప్పి సన్మానించారు.. తదుపరి చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ టూ టౌన్ పరిధిలో శాంతి భద్రతలకు తన వంతుగా పూర్తి దశలో సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. టూ టౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ పట్టణాన్ని శాంతి, భద్రతల విషయంలో కఠినంగా ఉంటానని, ప్రజలందరికీ న్యాయం కలిగేలా నా సేవలు కొనసాగిస్తానని తెలిపారు.(Story : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమును కలిసిన టూ టౌన్ సీఐ)