అర్హత గల వారందరికీ పెన్షన్ పంపిణీ మా ధ్యేయం
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని అర్హత గల వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడమే మా ధ్యేయము అని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో 18,351 మందికి 7 కోట్ల 92 లక్షల 19 వేలు రూపాయలు ప్రభుత్వం ద్వారా నిధులు రావడం జరిగిందని, ఈ నిధులను ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా 94 శాతము పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామని వారు తెలిపారు. మా పురపాలక అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడ ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చూడడం జరిగిందని తెలిపారు. (Story : అర్హత గల వారందరికీ పెన్షన్ పంపిణీ మా ధ్యేయం)