ఇష్టరాజ్యంగా మార్కెట్లో సుంకాల దోపిడి
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని కాయగూరల మార్కెట్లో చిరు వ్యాపారులకు శుంకాలను అధిక పేరిట దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. అదనపు సుంకాల పేరుతో నిలువు దోపిడీ చేస్తూ, మాకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని బాధను వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ వేళములో అధికారులు నిర్ణయించిన ధరలకంటే అదనపు డబ్బు వసూలుకు పాల్పడుతున్నారని తెలుపుతున్నారు. నూరు రూపాయల వరకు వసూలు చేయడం, 10 లేదా 20 రూపాయల రసీదు ఇచ్చి 30 నుండి 50 రూపాయలు దాకా దండుకుంటున్నారు. మరి కొంతమంది చిరు వ్యాపారులకు రసీదులు కూడా ఇవ్వకుండా ఇష్టరాజ్యంగా 20 నుండి 100 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు రావడం అధిక రుసుమును తెలుసుకొని విధిలేని పరిస్థితుల్లో సుంకమును చెల్లిస్తున్నామని వారు మండిపడుతున్నారు. మరికొందరు వ్యాపారస్తులయితే పట్టణ సమీపంలోని గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నారు. గతంలోనే అధిక సుంకం వసూలు చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకున్న, కుక్క తోక వంకర అన్నట్లు సుంకాలు వసూలు చేసేవారి ధోరణి మారటం లేదని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా శుంకాలు వసూలు చేసే వారి పైన తగిన నిఘా వేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ, గ్రామీణ చిరు వ్యాపారస్తులు కోరుతున్నారు. (Story : ఇష్టరాజ్యంగా మార్కెట్లో సుంకాల దోపిడి)