సెప్టెంబర్ నెల 28 న జాతీయ లోక్ ఆదాలత్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా
అధికార సంస్థ చైర్మన్ ఎస్. వి. పి. సూర్య చంద్ర కళ
న్యూస్ తెలుగు /ములుగు : సెప్టెంబర్ నెల 28 న జాతీయ లోక్ ఆదాలత్, ములుగు కోర్ట్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్ వి పి చైర్మన్ సూర్య చంద్ర కళ తెలిపారు.ఈ సందర్బంగా ఎస్ వి పి సూర్య చంద్ర కళ మాట్లాడుతూ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు తేదీ : 28.09.2024 నిర్వహించబడే,జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. శనివారం ములుగు జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్ వి పి సూర్య చంద్ర కళ పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు తో సమావేశం నిర్వహించి,ఈ సమావేశంలో మాట్లాడుతూ ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి ,ములుగు పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజీమార్గం ద్వారా వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలియజేశారు.లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ సలహా సూచనల కొరకు అయిననూ న్యాయ సేవా అధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలను పొందగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కమ్ కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ములుగు, టి. కన్నయ్య లాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి. జే. సౌఖ్య, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, డి. రామ మోహన్ రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్స్.పి .రవి కిరణ్, బి. శ్యామ్ ప్రసాద్,ఆర్. డి. ఓ. సత్య పాల్ రెడ్డి,ములుగు ఎస్. డి. పి.ఓ. ఎన్. రవీందర్, మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (story : సెప్టెంబర్ నెల 28 న జాతీయ లోక్ ఆదాలత్)