సుస్థిర,సమగ్రాభివృద్దే ఇందిరమ్మ రాజ్యం పరమావధి
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : పెద్దమందడి,ఖిల్లా ఘణపురం మండలాలతో నూతన వ్యవసాయం మార్కెట్ కమిటీ ఏర్పాటు డిజిటల్ కార్డు ద్వారా సంక్షేమ పథకాల అమలు ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల సుస్థిర,సమగ్ర అభివృద్దే పరమావధిగా పాలన చేస్తున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండల లో ఎమ్మెల్యే.ఉమ్మడి మహబూబ్ నాగర్ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిపలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో నూతన ప్రాథమిక వ్యవసాయ,సహకార పరపతి సంఘం కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. వెంకటాం పల్లి గ్రామంలో సాగర కమ్యూనిటీ భవనం, ఆగరం గ్రామ ప్రాథమిక పాఠశాల నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం రాయితి సిలిండర్ల ధ్రువపత్రాలను పంపిణీ చేసారు. దేశం గొప్ప పరిశ్రామిక,సామాజిక వేత్త రతన్ టాటా కోరపోవడం బాధకరమన్నారు. మృతి పట్ల నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సమగ్రాభివృద్దే పరమావధిగా పాలననందిస్తున్నామని అన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. వనపర్తి నియోజకవర్గం లో సుమారు నాలుగు లక్షల జనాభా,దాదాపు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. పెరుగుతున్న జనాభాకానుగూణగంగా రైతుల సౌకార్యార్థం ఖిల్లా ఘనపురం,పెద్ద మందడి మండలలాలకు మరో వ్యవసాయం మార్కెట్ యార్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత చూపారని తెలిపారు వనపర్తి నియోజకవర్గంలో వానాకాలం సంబంధించి సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ని నిరవేరుస్తు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నామన్నారు. మహిళలను కోటిశ్వరూలుగా చేయాలనీ,మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా ఆదర్శ్ పాఠశాల పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతుల కల్పన లో మహిళలను భాగస్వాములను చేసామని,ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ భాద్యత మహిళ సంఘాలకు అప్పగించామన్నారు. గత పదేళ్ల పాలనలో బీఅర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమిలేదని,కేవలం అభివృద్ధి మాటున అవినీతికి కబ్జాలకి పాల్పడ్డారని ఆరోపించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పెద్దమందడి సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య వెంకట్రావు, సాయి చరణ్ రెడ్డి, నియోజకవర్గ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : సుస్థిర,సమగ్రాభివృద్దే ఇందిరమ్మ రాజ్యం పరమావధి)