లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపు
వీఎంసీ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్గాలకు లోతట్టు ప్రాంతాల్లో, ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు. 15, 16, 17, 18, డివిజన్లు, కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వారిని శనివారం పునరావస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన త్రాగునీరు, భోజన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. వర్షం నీటిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ పునరావస కేంద్రాలకు తరలిరావాలని, ప్రాణహాని లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న వారికి వీఎంసీ అధికారులు ఇంటి వద్దనే త్రాగునీటి, భోజన సదుపాయం కల్పిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది 24 గంటలు పని చేస్తారని, నగర పౌరులకు ఎలాంటి సమస్య వచ్చినా 0866-2424172, 0866-2427485 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుపవచ్చని, 8181960909 వాట్సాప్ ఈ నెంబర్ ద్వారా కూడా సమస్యను తెలుపవచ్చని తెలిపారు. (Story : లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపు)