UA-35385725-1 UA-35385725-1

జోరు వానలో జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన   

జోరు వానలో జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన   

        న్యూస్‌ తెలుగు/విజయవాడ : అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాల వల్ల సంబవించే ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు జిల్లా కలెక్టర్‌ డా.జీ.సృజన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాల్లో శనివారం కలెక్టర్‌ పర్యటించారు. జిల్లాలోని వాగులు, వంకలు, కాలువలు వర్షపు నీటితో పోటెత్తటంతో తీవ్ర వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి సమస్యలు తెలుసుకునేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. మొగల్రాజపురం సున్నపు బట్టీలు సెంటర్‌ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపదిన ప్రదేశాన్ని పరిశీలించి మృతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు పరిశీలించారు. మునిగిపోయిన రోడ్లను నీరు నిలిచిన పల్లపు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కురుస్తున్న వర్షంతో పాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షపు నీటితో జి కొండూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బుడమేరు వరదనీటి ముంపు వల్ల జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. కొండపల్లి ఖాజామాన్యం వద్ద బుడమేరు కట్టతెగి భారీ ఎత్తున వరద నీరు నివాస ప్రాంతాలకు చేరుకోవడంతో అక్కడి ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఈ విపత్తులో ఎన్డీఆర్‌ఎఫ్‌ సభ్యుల బృందానికి తోడ్పాటు అందించాలని రెవిన్యూ, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం ముంపుకు గురైన కొండపల్లి పారిశ్రామిక వాడ వీటీపీఎస్‌లోని పలు కాలనీలు, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో నందిగామ`చందర్లపాడు మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించయని, నందిగామ నుండి చందర్లపాడు వెళ్లే మార్గంలో అడవిరావులపాడు చందాపురం వద్ద నల్లవాగు రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయని ఆమె తెలిపారు. పెనుగంచిప్రోలు-నందిగామ, పెనుగంచిప్రోలు-జగ్గయ్యపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా మార్గాలలో ప్రజలు రాకపోకలు సాగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రేయింబవళ్లు అప్రమతత్తతో ఉండి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.      (Story : జోరు వానలో జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన    )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1