వరద తీవ్రత వలన తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేత
న్యూస్ తెలుగు /ములుగు : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో, ములుగు జిల్లాలో పస్రా తాడ్వాయి మధ్యగల జలగలంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ,తాత్కాలికంగా వాహనాలను నిలిపివేయడం జరుగుతున్నదని, ములుగు డి ఎస్పీ రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వాజేడు పేరూరు,వెంకటాపురం, చతిష్ ఘాడ్ భూపాలపట్నం వెళ్లేవారు,తమ ప్రయాణాలను నిలుపుకోవాలని, అలాగే పస్రా వెంగలాపూర్ మధ్య వరద తీవ్రత వలన రోడ్డును మూసివేయడం జరుగుతున్నదన్నారు. చతిష్ ఘాడ్ వెళ్లేవారు గుండెప్పాడ్,భూపాలపల్లి,కాటారం,మహదేపూర్ మీదుగా వెళ్ళవలసి ఉంటుందని, తెలిపారు. (Story :వరద తీవ్రత వలన తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేత)