UA-35385725-1 UA-35385725-1

చంద్రబాబును చూస్తుంటే..జాలేస్తోంది

చంద్రబాబును చూస్తుంటే..జాలేస్తోంది

23 మందితో రాజీనామాలెందుకు చేయించలేదు ?

ఖాళీ రాజ్యసభ స్థానాల్లో అదే సామాజికవర్గంతో భర్తీ చేయాలి

ఆయన ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదు

మీడియా సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని

న్యూస్ తెలుగు/అమరావతి: ఇంకా ప్రలోభాలు, కొనుగోళ్లు చంద్రబాబుకు అలవాటుగా మారిందని, ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, అది చూస్తుంటే ఆయనపై జాలి కలుగుతోందని మాజీ మంత్రి, parnnipaఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అతిపెద్ద రాజకీయ ఆషాడభూతి అని, నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకు అలవాటు అని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఏనాడూ తన సొంత బలంతో గెలవలేదని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కుచెదరదని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌గారిని ఏమీ చేయలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్‌ తనకు రాజకీయంగా అడ్డు పడతారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, అందుకే 2011 నుంచి ఆయనను రాజకీయాల నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ ప్రక్రియలోనే జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని, అయినా ఆయన ధైర్యం కోల్పోకుండా ప్రజల్లో నిల్చి, తొలుత 67 సీట్లు గెల్చి సత్తా చూపారని గుర్తుచేశారు. అప్పుడు కూడా తమ పార్టీని, జగన్‌గారిని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని చెప్పారు. టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే ఆ పని చేయాలని చెబుతున్న చంద్రబాబు, అప్పుడు ఆ 23 మందితో ఎందుకు రాజీనామా చేయించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల నుంచి టీడీపీ కండువాలు కప్పుకున్న మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా జగన్‌గారిని ఒక్క అంగుళం కూడా తగ్గించలేరని తేల్చి చెప్పారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరమని, అదే జగన్‌ గెలవాలంటే జనం సాయం చాలని నాని స్పష్టచేశారు. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్‌ జిలానీ బ్యాచ్‌లు జగన్‌గారిని అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారన్నారు. వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌, వారికి పదవులు కట్టబెట్టారని గుర్తు చేసిన పేర్ని నాని, ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్‌ చేశారు. కేవలం జగన్‌ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లలసభలో అడుగుపెట్టగలిగాడని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు (డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ) ఇలా ప్రలోభాలతో ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, శాంతి భద్రతల గురించి అస్సలు ఆలోచించకుండా, బాధ్యతను పూర్తిగా మర్చిన హోం మంత్రి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్ని నాని ఆక్షేపించారు. 2014లో మా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఏనాడూ మా పార్టీ గుమ్మం తొక్కని కుక్కల విద్యాసాగర్‌ను, ఇప్పుడు మా పార్టీకి అంటగడుతున్నారని, ఇదంతా టార్గెటెడ్‌ ఐపీఎస్‌ అధికారులను వేధించడమే లక్ష్యంగా జరుగుతున్న కుట్రని తెలిపారు. ఆ నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ఆనాడు తమ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారనీ, ఇప్పుడు లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని చెప్పారు. (Story : చంద్రబాబును చూస్తుంటే..జాలేస్తోంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1