బీబీజీ అంకితభావం స్ఫూర్తిదాయకం
న్యూస్తెలుగు/ హైదరాబాద్: బాలికా సాధికారతపై బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ అంకితభావం స్ఫూర్తిదాయకంగా ఉందని సినీ నటి మాళవికశర్మ తెలిపారు. హెచ్ఐసీసీ, నోవాటెల్లో ఇటీవల బంగారు తల్లి 459వ బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ వేడుక నిర్వహించారు. బంగారుతల్లికి బీబీజీ నుంచి 45 లక్షల చెక్కును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికా సాధికారతకు కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) సీఎండీ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ బాలికా సాధికారతకు కట్టుబడి ఉన్నామన్నారు. పీ శ్రీనివాసరావు, నీరజ, కస్తూరి ఉషతో సహా బంగారుతల్లి సభ్యుల అంకితభావాన్ని కొనియాడారు. హైదరాబాద్, ఖమ్మం, వైజాగ్, విజయవాడ, పాలకొల్లు, నిజామాబాద్, నారాయణఖేడ్, కంఠితో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. (Story : బీబీజీ అంకితభావం స్ఫూర్తిదాయకం)