పీబీ పార్ట్‌నర్స్ 73% వాటాతో గణనీయమైన వృద్ధి
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్: పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్ల ఆధ్వర్యంలోని బ్రాండ్ పీబీ పార్ట్‌నర్స్, తన విలక్షణమైన పాయింట్స్ ఆఫ్ సేల్ పర్సన్ మోడల్‌తో బీమా పరిశ్రమలో కొత్త కొలమానాలను, మైలురాళ్లను నెలకొల్పుతోంది. కంపెనీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తాజా మోటారు బీమా కొనుగోలు పోకడలను, ఈ విభాగంలో సాధించిన అద్భుతమైన వృద్ధిని ప్రత్యేకంగా వివరించింది. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్, సేల్స్ హెడ్, మోటార్ బిజినెస్ అమిత్ భడోరియాతో పాటు పీబీ పార్ట్‌నర్స్ నుంచి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. (Story : పీబీ పార్ట్‌నర్స్ 73% వాటాతో గణనీయమైన వృద్ధి)