Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యువత ఎన్నో విజయాలు సాధించగలరు

యువత ఎన్నో విజయాలు సాధించగలరు

0

యువత ఎన్నో విజయాలు సాధించగలరు

క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి

సీఎం చంద్రబాబు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులకు వెలుగులోకి వచ్చారు

“టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి

జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు.

ప్రతి ఓటమి గెలుపుకు మెట్టు..కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు..పి.వి. సింధు

న్యూస్‌తెలుగు/ విజయవాడ : భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుడికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభించిందని ప్రధానంగానే నేడు రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువ గా ఉన్నారు వారందరూ క్రీడారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తామని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
ముందుగా ధ్యాన్చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటమికి కంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలని, కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలని పి.వి.సింధు తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా క్రీడా విధానంలో ప్రతిపదలకు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి తోడ్పాటు అందిస్తున్నామని శాప్ ఎండి తెలిపారు. కార్యక్రమానంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిడ్స్ ను అందజేశారు. మునిసిపల్ స్టేడియం నుండి పీవీపీ మాల్ వరకు నిర్వహించిన ర్యాలీని మంత్రి జండా ఊపి ప్రారంభించి “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” నినాదంతో ర్యాలీలో పాల్గొన్నారు. (Story : యువత ఎన్నో విజయాలు సాధించగలరు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version