పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ త్వరగా పూర్తి చేయాలి
జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. గుర్ల మండలం కెల్ల పిఏసిఎస్ ను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న రికార్డుల కంప్యూటరీకరణ ను పరిశీలించారు. జరుగుతున్న ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. టీసీఎస్ సాఫ్ట్వేర్ ను పరిశీలించారు. పర్సన్ ఇంఛార్జులు, కార్యదర్శుల నియామక ప్రక్రియపై ఆరా తీశారు. బ్రాంచ్ కంప్యూటరీకరణ దాదాపు పూర్తయిందని అధికారులు జేసీకి వివరించారు. మొత్తం 65 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని, అక్టోబరు 2 నుంచి కంప్యూటర్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాలని జెసి ఆదేశించారు.
ఈ పర్యటనలో డిసిసిబి సీఈవో ఉమామహేశ్వరరావు, కెల్ల బ్రాంచ్ మేనేజర్ కె.ప్రీతి మానస, సూపర్వైజర్ వై.యెర్నిబాబు, ఇతర సిబ్బంది, తహసీల్దార్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు. (Story : పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ త్వరగా పూర్తి చేయాలి)