శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం
ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్
న్యూస్‌తెలుగు/అమరావతి : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా శ్రీమతి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, శ్రీ జస్టిస్ వెణుతురుమల్లి గోపాల కృష్ణా రావు ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్ లో బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇరువురితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.
ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఇరువురిని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను భారత రాష్ట్రపతి ఆమోదించిన పిదప వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, హై కోర్ట్ సిబ్బంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. (Story : శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం)