ఎరువులు అమ్మకాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే లైసెన్స్ ల రద్దు
న్యూస్‌తెలుగు/వినుకొండ : సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయం, వినుకొండ వారు తెలియజేయడం ఏమనగా బుధవారం వినుకొండ సబ్ డివిజన్ పరిధిలో గల వినుకొండ లో గల హోల్సేల్ అండ్ రిటైల్ లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్లకు ఏడిఏ రవిబాబు, ఎంఏఓ వినుకొండ అంజిరెడ్డి కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాగంగా ఎరువులు అమ్మకలపైన ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అమ్మినట్టు ఫిర్యాదు వచ్చిన యెడల లైసెన్స్ లను రద్దు పరుస్తామని హెచ్చరించారు. ఏడిఏ రవిబాబు గ మాట్లాడుతు యూరియా , డిఏపి మరియు ఇతర ఎరువులను ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ అమ్మినట్లు ఫిర్యాదు వచ్చినయెడల తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఏఓ వినుకొండ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి గురువారం స్టాక్ రిపోర్ట్స్ ను మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు సబ్మిట్ చెయ్యాలని తెలిపారు. డీలర్లకు ఎరువులను అమ్మినపుడు పూర్తి వివరాలతో బిల్ల్స్ ఇవ్వాలని అన్నారు. .గ్రామాలలో అప్రమత్తంగా అనదికరంగా ఎవరైనా ఎరువులు అమ్మినట్టూ మరియు అధిక ధరలకు అనగా ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే సహాయ వ్యవసాయ సంచాలకులు కార్యాలయానికి ఏడిఏ బి.రవిబాబు కు 8331056959, వినుకొండ మండల వ్యవసాయ అధికారి కె.అంజిరెడ్డి 8331056960 సంప్రదించాలని కోరారు. (Story : ఎరువులు అమ్మకాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే లైసెన్స్ ల రద్దు )