సాక్షులను బెదిరిస్తున్నారు
నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి..!
మాజీ ఎంపీపీ కందుల కృష్ణ
న్యూస్ తెలుగు/ చాట్రాయి : తన కూతురు కందుల జయలక్ష్మిని చంపిన వారు బెదిరిస్తున్నారని సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ ఎంపీపీ కందుల కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి కందుల కృష్ణ మాట్లాడుతూ .తన కూతురు కందుల జయలక్ష్మి ని ఏప్రిల్ ఆరో తేదీన చంపివేశారని మొదట తాను కూతురు చనిపోయిన వేదనలో ఉండగా రెండు మూడు రోజుల తరువాత మా లాప్టాప్ మెసేజీలు ఫోన్ మెసేజీలు చెరిపించడం కోసం కొంతమంది చేసిన ప్రయత్నంలో తనకు అనుమానం వచ్చిందని ఏప్రిల్ 11వ తేదీన చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా కూతురు చనిపోయిన నన్ను ఆరోజు చాట్రాయి ఎస్సై నా మీదకు వచ్చారని కొట్టే అంత చేశారని బెదిరించారని తర్వాత పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారని మంత్రి సారథి హోంశాఖ మంత్రి అనిత జిల్లా ఎస్పీలకు తన గోడు వెళ్ళబుచ్చుకోగా వారు విచారణకు ఆదేశించారని చాట్రాయి తహసిల్దార్ చేసిన విచారణలో హత్య జరిగినట్లు గుర్తించి ఆమె వెల్లడించారన్నారు. ఆ తర్వాత నుంచి నా కూతుర్ని చంపిన వారు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుర్ని చంపిన తొలినాళ్లలోనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చంపిన వారిని రహస్యంగా కోళ్లదొడ్డిలో దాయడం మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని తిప్పడం అంతేకాకుండా సెంటర్లో నే తనను బెదిరించారన్నారు. ఇటువంటి వారందరూ కలిసి సాక్షులను ప్రభావితం చేస్తూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కేసు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. (Story : సాక్షులను బెదిరిస్తున్నారు)