రన్ ఆఫ్ కచ్‌లో ఎంజి విండ్సర్ నైపుణ్య ప్రదర్శన
ముంబయి: జేస్ డబ్ల్యూ ఎంజి మోటార్ భారతదేశంలో రాబోతున్న వాహనం- ఎంజి విండ్సర్, భారతదేశపు మొదటి క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికిల్ (సీయూవీ) గుజరాత్‌లోని సమస్యాత్మకమైన భూభాగం రన్ ఆఫ్ కచ్‌లో తన సాటిలేని సామర్థ్యాన్ని ప్రదర్శించింది. భారతదేశపు మొదటి పీమేవీ-ఎంజి విండ్సర్ తన నైపుణ్యాన్ని నిరూపించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ఎడారులలో ఒకటైన రన్ ఆఫ్ కచ్ లోని 44డిగ్రీ సెల్షియస్‌కి పైగా తీవ్రమైన వేడిలో తన ఇంజనీరింగ్ శ్రేష్టతను వెల్లడిరచింది. కఠినమైన, తీవ్రమైన పరిస్థితిలో తీవ్రమైన ఉష్ణోగ్రతల కింద ఎంజి విండ్సర్ తట్టుకునే సామర్థ్యాన్ని, సాహసాన్ని తాజాగా విడుదలైన వీడియో తెలియచేస్తోంది. ఈ తీవ్రమైన పరిస్థితిలో ద ఇంటిలిజెంట్ సీయూవీ ప్రయాణం తన దృఢమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ, సాటిలేని సామర్థ్యానికి నిరూపణ. కఠినమైన సవాళ్లను తట్టుకునే విధంగా రూపొందిన ఈ పరీక్ష నేలను ఆక్రమించడమే కాకుండా, వాస్తవిక ప్రపంచ పరిస్థితులలో విండ్సర్ ఆధిపత్యం, నైపుణ్యాన్ని కూడా సుస్థిరపరుస్తుంది. (Story : రన్ ఆఫ్ కచ్‌లో ఎంజి విండ్సర్ నైపుణ్య ప్రదర్శన)