ఐఈఎల్‌టీఎస్ 19ని ప్రారంభించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్
ముంబయి: ఐఈఎల్‌టీఎస్ పరీక్షకు సహ భాగస్వాములుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్ (సీయూపీఏ) అధికారిక కేంబ్రిడ్జ్ పరీక్షల తయారీ రిసోర్సు ‘ఐఈఎల్‌టీఎస్ 19’ని ప్రారంభించింది. న్యూ ఢల్లీిలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్, కంబైన్డ్ ఇంగ్లీష్-సౌత్ ఏషియా హెడ్ టీకే అరుణాచలం నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో దీన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని గుర్తించే మొదటి అంచనాగా, ఐఈఎల్‌టీఎస్ విద్యా సంస్థలు, యజమానులు, ఇమ్మిగ్రేషన్ అధికారులచే భాషాపరమైన సామర్ధ్యానికి ప్రమాణంగా గుర్తించబడిరది. అదే విధంగా ఐఈఎల్‌టీఎస్ 19, విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకునే వారికి నుంచి ఒక ప్రామాణికమైన పరీక్ష తయారీకి రిసోర్సుగా కేంబ్రిడ్జ్ పని చేస్తోంది. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్ కంబైన్డ్ ఇంగ్లీష్-సౌత్ ఏషియా హెడ్ అరుణాచలం టీకే మాట్లాడుతూ, ఇది ఇంగ్లీష్ ఒక వాహికగా పనిచేస్తూ, వ్యక్తుల మధ్య సహకార సంభాషణను సరళం చేస్తూ, వారు ప్రపంచ పౌరులుగా మారడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు. (Story : ఐఈఎల్‌టీఎస్ 19ని ప్రారంభించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్)