Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మీ రాజకీయాలకోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం అడొద్దు…!

మీ రాజకీయాలకోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం అడొద్దు…!

0

మీ రాజకీయాలకోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం అడొద్దు..!

వాలంటీర్ లకు న్యాయం చేయాలి..!

 రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లు కు న్యాయం చేయండి..!

28 జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు శుభవార్త తెలియజేయాలి

ఆంధ్రప్రదేశ్ వాలంటిర్స్ అసోషియేషన్ గౌరవాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య

న్యూస్‌తెలుగు/క‌డ‌పః రాజకీయ పార్టీల స్వార్థాల కోసం మా జీవితాలతో చెలగాటం ఆడవద్దని, వాలంటీర్లకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జి ఈశ్వరయ్య, అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.
28న జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ,వాలంటీర్లకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప చిలకల బావి వద్ద ఉన్న హోచ్ మిన్ భవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో కడప జిల్లా వాలంటీర్స్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజకీయాల కోసం రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాల కోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని, వాలంటీర్లకి 10000 జీతం ఇస్తామని అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే ఇన్ప్లిమెంట్స్ చేయాలని,రాష్ట్రంలో ఉన్నటువంటి గడిచిన రెండు మూడు నెలల నుంచి జీతభత్యాలు నిలిచిపోయిన బకాయిలు తక్షణమే విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లకి వారి జీతాన్ని ఇప్పించాలని,ఎలక్షన్ల సమయంలో లక్ష పైచిలుకు వాలంటరీలో రాజీనామాలు చేశారు అట్టి రాజీనామాల్ని బలవంతపు రాజీనామాలుగా పరిగణలోకి తీసుకొని తక్షణమే వారిని విధుల్లోకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇప్పించాలని కోరారు.మా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకు కోవడం జరిగిందని తెలిపారు.
రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయలుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, పురపాలక పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు వాలంటీర్ ఆవేదన తెలియజేస్తూ వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించాలని కోరుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రాధేయపడుతూ మెయిల్స్ ద్వారా పోస్ట్ కార్డుల ద్వారా లేఖలు పంపడం జరిగిందని, వాలంటీర్ల మీద రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నిరుద్యోగుల ఆవేదన తెలియజేస్తూ వారి సేవలను గుర్తించాలని కరోనా సమయంలో వారు చేసిన త్యాగాలను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,ఆగస్టు 31 లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రకటన రానిపక్షంలో
ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ల గోడును విన్నవించుకుంటూ వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ నాయకులు కే వెంకటసుబ్బయ్య, సుబ్బారెడ్డి, ఎస్ సయ్యద్, ఎస్ నరసింహ, ఎం సురేష్, ఎస్ శ్రీధర్, వి.వెంకటరమణ, ఈ.డాబర్ భాష, ఎల్ శ్రీను, వై వెంకటేష్, సురేష్, షేక్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (Story : మీ రాజకీయాలకోసం వాలంటీర్ల జీవితాలతో చెలగాటం అడొద్దు…!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version