Homeవార్తలుతెలంగాణసురవరం కృషి అనన్యమైనది

సురవరం కృషి అనన్యమైనది

సురవరం కృషి అనన్యమైనది

ఎమ్మెల్యే మేఘా రెడ్డి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : పత్రిక సంపాదకుడిగా, రచయితగా, పండితుడిగా ఉద్యమకారుడుగా సాగిన సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం అనన్యమైనదని… ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శవంతంగా తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు
సురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఎంఎల్ఏ వనపర్తి క్యాంపు కార్యాలయం సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి గారి విగ్రహం వద్ద ఆహ్లాదకరమైన పార్క్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్, పాకనాటి కృష్ణయ్య, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : సురవరం కృషి అనన్యమైనది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!