శ్రావణ మంగళవారం నోములు 27న ముగించుకోవాలి
జ్యోతిష్యశ్రీ భోగాపురపు వాయునందనశర్మ
న్యూస్‌తెలుగు/విజయనగరం :
ఈ క్రోధి నామ సంవత్సరంలో శ్రావణమాసం ఆగస్టు 5 సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారం తో ముగియనున్నది.అయితే శ్రావణ మంగళవారం నోములు నొచ్చుకునే చాలా మంది మహిళామణులు ఆగస్టు 27 నాడు ఆఖరి మంగళవారమా? లేకా సెప్టెంబర్ 3 ఆఖరి మంగళవారమా? అన్న ధర్మ సందేహం వచ్చినందున దీనికి జ్యోతిష్యశ్రీ భోగాపురపు. వాయునందన శర్మ పూర్తి వివరణ ఇచ్చారు. ఈనెల 27 శ్రావణ మంగళవారం నోములకు చివరి తేదీ అని స్పష్టం చేశారు.పితృతిథి అయిన అమావాస్యనాడు గృహస్తు ధర్మంలో ఉన్నవారికి నోములు, వ్రతాలు ఇత్యాది ధార్మిక కార్యక్రమాలు చేయరాదని ధర్మసింధు, నిర్ణయ సింధు వంటి గ్రంధాలలో తెలియజేశారని పేర్కొన్నారు.ఈ శ్రావణమాసం 27 వ తేదీ మంగళవారంనాడే చివరిమంగళవారంగా భావించి మంగళవారం నోములు ముగించుకోవడం ధర్మ శాస్త్రమని తెలియజేశారు. (Story : శ్రావణ మంగళవారం నోములు 27న ముగించుకోవాలి)