గీతాంజలి స్కూల్స్ నందు మదర్ – చైల్డ్ డ్రెస్ కోడ్ ఆక్టివిటీ
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక కొత్తపేట గీతాంజలి స్కూల్ నందు మదర్ – చైల్డ్ డ్రెస్ కోడ్ ఆక్టివిటీ నిర్వహించగా పలువురు తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి స్కూల్స్ ప్రిన్సిపాల్ శ్రీమతి టి. కృష్ణవేణి మాట్లాడుతూ చిన్నారులను కేవలం పాఠశాలకు పంపడం మాత్రమే తల్లుల బాధ్యత కాదు కానీ ప్రతి ఒక్కరూ పాఠశాలలో భాగస్వాములు కావాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాము అని ఇంత మంది తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలలో భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా వుంది అని తెలిపారు. విద్యార్థులు మరియు వారి తల్లులు ఒకే రకమైన డ్రెస్లను ధరించి పాఠశాలకు రావడం వలన ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. అనంతరం జరిగిన పలు ఆటలు పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ వై. శేషగిరిరావు, కరస్పాండంట్ శ్రీ. వై. యల్. కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : గీతాంజలి స్కూల్స్ నందు మదర్ – చైల్డ్ డ్రెస్ కోడ్ ఆక్టివిటీ)