అమ్మ ఆదర్శ పాటశాల ద్వారా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : అమ్మ ఆదర్శ పాటశాల ద్వారా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఉదయం పానగల్, వీపనగండ్ల, చిన్నంబావీ మండలాల్లో పర్యటించారు. పానగల్ కస్తూర్బా గాంధీ విద్యాలయం, వీపనగండ్ల కస్తూరిబా బాలికల విద్యాలయంతో పాటు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు అయిన పనులను పరిశీలించారు. పనులు త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పానగల్ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రహరీ ఫెన్సింగ్, తాగు నీటి బోర్ వెల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఫెన్సింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పి.యం. శ్రీ కింద నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఫీవర్ సర్వే పెంచాలి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను ఆదిలోనే అరికట్టేందుకు ఆసుపత్రికి జ్వరం లక్షణాలతో వచ్చిన ప్రతి వ్యక్తికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయించాలని ఆదేశించారు. పానగల్ ప్రాథమిక ఆరోగ్యంద్రాణి సందర్శించారు. ల్యాబ్ తో పాటు మందుల స్టాక్ రిజిస్టర్ లు, ఈ.డి.డి రిజిస్టరు పరిశీలించారు. రిజిస్టర్లు సరిగా పెట్టడం లేదని వాపోయారు.
దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై రూపొందించిన చేతి కరపత్రం ప్రతి ఇంటికి ఇచ్చి అవగాహన కల్పించాలని ఎంపీడీఓ ను ఆదేశించారు.(Story : అమ్మ ఆదర్శ పాటశాల ద్వారా మంజూరు చేసిన పనులు త్వరగా పూర్తి చేయాలి)