మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసిన జాతీయ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఆర్థిక స్తోమత లేక నైపుణ్యత ఉన్నా క్రీడారంగంలో మరుగున పడిపోతున్న ఎందరో గ్రామీణ యువకులలో పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన మైనారిటీ యువ క్రీడా రత్నం షేక్ అబ్దుల్లా ఒకరు.
ఇంటర్మీడియట్ నుండి రాష్ట్రస్థాయి పరుగు పందాలలో పాల్గొని ఎన్నో పతకాలు సాధించిన జాతీయ క్రీడాకారుడు అబ్దుల్లా తండ్రి ఓ సామాన్య పండ్ల వ్యాపారి, కష్టజీవి కుటుంబాన్ని పోషిస్తూ దైవభక్తి గల తండ్రికి చేదోడు గా ఉంటూ డిగ్రీ పూర్తి చేశాడు.
వీరికి నలుగురు సంతానం వీరిలో షేక్ అబ్దుల్లా పరుగు పై ఉన్న మక్కువతో ఎండనక, వాననక 24 గంటలు కష్టపడి ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు సాధన చేస్తున్నాడు. జాతీయస్థాయిలో జరిగే మారధాన్ పరుగు పందెం పోటీలలో పాల్గొనేందుకు భూటాన్, నేపాల్ తదితర దేశాలలో జరిగే పోటీలలో పాల్గొన్నారు. భవిష్యత్తులో జరగబోయే లండన్ యుఎస్ఏ, యూఏఈ ఒలంపిక్స్ పోటీలలో పాల్గొని దేశానికి పేరు తెచ్చేందుకు ఆర్థిక సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
ఇందులో భాగంగా గుంటూరు వాసి, పూర్వ డిగ్రీ కాలేజీ రికార్డు అసిస్టెంట్ సయ్యద్ కరిముల్లా ప్రోత్బలంతో సీఎం క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర మహిళా శిశు, గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ని కలసి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాల అందించవలసినదిగా కోరారు. (Story : మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసిన జాతీయ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా)