ఏఐసీసీటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా చైతన్య వేదిక
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక ప్రజా చైతన్య వేదిక ఏఐసీసీటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పై మానభంగం చేసి కిరాతకంగా హత్య చేసిన మృగాలను వెంటనే ఉరితీయాలని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి శివయ్య స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ టి యు కార్యదర్శి ఎస్ కె. ఫిరోజ్, అధ్యక్షత వహించగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు మాట్లాడుతూ ఆగస్టు 9న కలకత్తాలో మెడికల్ కాలేజీ హాస్పటల్ లో జరిగిన క్రూరమైన మానభంగం చేసి హత్య చేసిన మృగాలను వెంటనే ఉరితీయాలని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలంటే సంఘటన జరిగిన వెంటనే కఠినమైన శిక్షలు అమలు చేయాలని , అప్పుడే భారతదేశ స్త్రీలకు రక్షణ ఏర్పడుతుందని ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని, స్త్రీలు భయాందోళనతో తమ విధులు నిర్వహిస్తున్నారని, తక్షణమే వారు పనిచేసే ప్రదేశాలలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీని పకడ్బందీగా అమలు చేయాలని, దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రభుత్వ డాక్టర్ అబ్దుల్ రజాక్, తిరుమల హాస్పిటల్, బాలాజీ హాస్పిటల్ మాధవరావు,, హాస్పిటల్ సిబ్బంది పాల్గొనే సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పిడుగు విజయకుమార్ మాట్లాడుతూ దేశంలో ఇటీవల కాలంలో మహిళ పైన అత్యాచారాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయని దీనికి ప్రధాన కారణం దేశంలో కఠినమైన శిక్షణ అమలు చేయలేకపోవటమే ఒక కారణం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పాలకవర్గాలను ప్రశ్నించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కామా వెంకటేశ్వర్లు, కార్మిక నాయకులు సంఘం దుర్గాప్రసాద్, లింగాచారి, యువజన నాయకులు గోపి, మునగపాటి ప్రసాదు, రవి, శిరీష, కోమలి, శేఖర్, సునీత, సురేష్ ,మొదలగువారు పాల్గొన్నారు సమావేశం ముగింపుగా కార్మిక సంఘం నాయకులు ఎస్ కె. ఫిరోజ్, మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని భయభ్రాంతులకు గురి చేసిందని చనిపోయిన రెండు రోజుల దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయటం అనేక అనుమానాలు వస్తున్నాయని, రూమ్ లో హత్య చేస్తే ఎలా వచ్చిందని దీనిపైన వ్యక్తి పూర్వకంగా ఎవరు కంప్లైంట్ చేయకపోగా దీని వెనకున్న అసలైన దోషుల్ని అరెస్టు చేసి ఉరిశిక్షేదించాలని యావత్ ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. (Story : ఏఐసీసీటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా చైతన్య వేదిక)