‘8 వసంతాలు’ పూర్తి కావస్తున్న షూటింగ్
ఇండియా లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్
న్యూస్‌తెలుగు / హైదరాబాద్ సినిమా : హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. వారి లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘8 వసంతాలు’, మను ఫేంఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న కాన్సెప్ట్-బేస్డ్ మూవీ.
MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటివలే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం 8 వసంతాలు చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఊటీ, హైదరాబాద్, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. మూవీ పూర్తి చేయడానికి టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం కాశ్మీర్, ఆగ్రా, వారణాసిలోని విభిన్న ప్రదేశాలకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్, శశాంక్ మాలి ఎడిటర్, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
నటీనటులు: అనంతిక సనీల్‌కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీర కిషోర్ తదితరులు. (Story : ‘8 వసంతాలు’ పూర్తి కావస్తున్న షూటింగ్)