‘కన్నప్ప’ నుండి కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్ లుక్స్ విడుదల
న్యూస్‌తెలుగు / హైదరాబాద్ సినిమా:
డైనమిక్ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను అగ్రెసివ్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్‌ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు ‘వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడు మరియు భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్‌లో వారి లుక్ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. “కన్నప్ప” అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్‌లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (Story : ‘కన్నప్ప’ నుండి కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్ లుక్స్ విడుదల)