‘భలే ఉన్నాడే’ హిలేరియస్ ట్రైలర్ రిలీజ్
న్యూస్‌తెలుగు / హైదరాబాద్ సినిమా: యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే హీరో పాత్రని హిలేరియస్ గా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ , మనీషా కంద్కూర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, వారి లవ్ స్టొరీ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ట్రైలర్ లో ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.
డైరెక్టర్ జె శివసాయి వర్ధన్ ఒక యూనిక్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, రాజ్ తరుణ్‌ని డిఫరెంట్ అండ్ హిలేరియస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేశారు. ఇలాంటి డేరింగ్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నందుకు రాజ్ తరుణ్ ని అభినందించాలి. రాజ్ తరుణ్ పెర్ ఫార్మెన్స్, తన కామిక్ టైమింగ్ అద్భుతంగా వున్నాయి. మనీషా కంద్కూర్ తన గ్లామర్ అండ్ నటనతో ఆకట్టుకుంది. టీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ క్యారెక్టర్స్, వారి టైమింగ్ చూస్తుంటే సినిమాలో ఎంటర్ టైమెంట్ అదిరిపోతుందని అర్ధమౌతోంది.
నగేష్ బనెల్లా కెమెరా వర్క్ బ్రిలియంట్ గా వుంది, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో వున్నాయి. మొత్తనికి హిలేరియస్ ట్రైలర్ సినిమాపై చాలాక్యురియాసిటీని పెంచింది.
ఈ చిత్రానికి బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్, సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు. (Story : ‘భలే ఉన్నాడే’ హిలేరియస్ ట్రైలర్ రిలీజ్)