వినతులు పరిష్కారానికి జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్
వినతులకు నాణ్యమైన, ఖచ్చితమైన సమాధానాలు పంపాలి- జిల్లా కలెక్టర్
న్యూస్‌తెలుగు /విజయనగరం : వినతులు పరిష్కారానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. అన్ని శాఖల నుండి సిబ్బందిని ఒక్కొక్కరు చొప్పున ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు డెప్యూట్ చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజా వినతులు పరిష్కార వేదిక లో భాగంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సి.ఎం.ఓ నుండి కలెక్టర్ కు వచ్చే వినతులను ఆయా సంబంధిత అధికారులకు పంపడం జరుగుతోందని, అర్జీ దారుతో మాట్లాడి, అర్జీదారు సంతృప్తి చెందిన తర్వాతనే వారి ఫోటో తో పాటు సమాధానాన్ని అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాణ్యమైన, ఖచ్చితమైన సమాధానాలు ఉండాలని, రీ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాలని తెలిపారు. వినతులు వచ్చిన రోజే అధికారులు ఓపెన్ చేయాలని, ఈ రోజు నాట్ ఓపెన్ 8 వినతులు ఉన్నాయని, సాయంత్రానికి అవి జీరో కావాలని తెలిపారు. వినతులు పరిష్కారం లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కువగా రెవిన్యూ కు చెందిన వినతులే వస్తున్నాయని, తహసిల్దార్లు ఈ విషయం లో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా, సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి. అనిత ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 129 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి 90, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 9 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 9, పంచాయితీ శాఖకు 06, అండగా మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. (Story : వినతులు పరిష్కారానికి జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్)