UA-35385725-1 UA-35385725-1

షాడోయిజంపై తెలుగు తమ్ముళ్ల గరంగరం..?

షాడోయిజంపై తెలుగు తమ్ముళ్ల గరంగరం..?

వివాదాస్పద అంశాలతో మాకు సంబంధం లేదు ఎన్నారై వంశీ
ఏకతాటిపైకి తెలుగు తమ్ముళ్లు

న్యూస్ తెలుగు/ చాట్రాయి : శృతిమించుతున్న షాడోయిజం శీర్షికతో న్యూస్ తెలుగు ప్రచురించిన కథనంపై చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ రాజకీయం గరంగరంగా మారింది. స్పందనలు ప్రతిస్పందనలు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల అధ్యక్షురాలు బొట్టు వరలక్ష్మికి సహాయకుడిగా కేవలం గత నాలుగు ఐదు నెలల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన ఓ వ్యక్తి సర్వాంతర్యామి నేనే అంటూ …? మంత్రి సారధికి మంత్రి పదవి ఇప్పించింది కూడా తానే అంటూ …? అధికారులు నాయకులు, కార్యకర్తలు అందరూ నా చెప్పు చేతల్లోనే పనిచేయాలని లేకుంటే ఎవరైనా అంతు చూస్తానని బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రారంభించి చాట్రాయి మండల చరిత్రలో ఏనాడూ లేనటువంటి కొత్త సంస్కృతి సాంప్రదాయాలను ప్రారంభించడమే కాకుండా మండలంలోని అతిపెద్ద గ్రామమైన చనుబండలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన చెత్త సంపద తయారీ కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లుగా నిరుపేద దళితులు ఆరుమంది కూలీలు ప్రతి ఒక్కరికి నెలకు 6000 రూపాయలు చొప్పున దానిలో పనులు చేసుకుంటూ వుండగా ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 41 నెలలపాటు పనిచేసిన వారి జీతం పద్నాలుగు లక్షల నాలుగు వేల రూపాయల వచ్చినప్పుడు వైసిపి వారితో కుమ్మక్కై కూలీల జీతం స్వాహా చేసిన పంచాయతీ అధికారికి వత్తాసు వెళ్లడం ఎవరు జీర్ణించుకోలేని అంశం. ప్రభుత్వం గ్రామాలలో అబివృద్దికై విడుదల చేసే నిధులు తన ద్వారా మాత్రమే వస్తాయని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు కూడా ద్వారానే అంచనాలు వేయాలని పలును ఎవరికి ఇవ్వాలో కూడా తానే చెబుతానని నేను చెప్పినట్లు చేయాలని ఆదేశిస్తున్న నేపథ్యంలో షాడో ఇజం పై న్యూస్ తెలుగు ప్రచురించిన కథనం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా చీపురుగూడెం గ్రామంలో చిన్నా చితకా గ్రామస్థాయి అధికారులు కార్యకర్తలు నాయకులు అందరూ నా దగ్గరికి రావాలి వేరే వారి దగ్గరికి వెళ్తే మీకు మొత్తం కట్ అవుతాయి అంటూ పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడటం ఎవరికి మింగుడు పడని పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు.న్యూస్ తెలుగులో కథనం వచ్చిన వెంటనే ఎన్నారై బొట్టు వంశీ స్పందిస్తూ. ఎన్నికల ముందు మండలంలో ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మా తండ్రి గారైన దివంగత నేత బొట్టు విజయ్ చౌదరి ఆశయ సాధన కోసం తెలుగుదేశం అభ్యర్థి మంత్రి సారధిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా మా తల్లి గారైన బొట్టు వరలక్ష్మికి మండల పార్టీ బాధ్యతలు తీసుకొని వ్యక్తిగతంగా మేము చేయగలిగినంత చేశామని ప్రజలకు మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి పని చేస్తున్నామని తెలిపారు. షాడో కార్యక్రమాలు , పేదవాళ్లను బెదిరించడం, లెటర్లు పేరుతో డబ్బులు వసూలు చేయడం , బ్లాక్ మెయిల్ రాజకీయాలతో మాకు గాని మండల తెలుగుదేశం పార్టీకి గానీ ఏ విధమైన సంబంధం లేదన్నారు. అతను అలా ఎందుకు చేస్తున్నారో తమకు తెలియదు అన్నారు. పార్టీని సమన్వయంతో నడిపించడం కోసమే మండల పార్టీ బాధ్యతలు తీసుకున్నామన్నారు. 18 గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలతో మంత్రి సారధితో మాకు మంచి అభినవ సంబంధాలు ఉన్నాయని పార్టీని ఐక్యమత్యంగా గ్రామలలో మంత్రి సారథి సారధ్యంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ స్తానిక ఎన్నికలలో‌ చాట్రాయి మండలాన్ని తెలుగుదేశం కంచుకోటగా తయారు చేయాలనేదే తమ లక్ష్యం అన్నారు. ఇది ఇలా వుండగా తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులందరూ వారి మధ్య ఉన్న ముఠా తగాదాలు గత విభేదాలను పక్కనపెట్టి ఏకతాటి పైకి వచ్చి షాడో వ్యవహారాలను తిరిగించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసమై ఊరూర చిన్న పెద్ద నాయకులు మొత్తం ప్రత్యేక సమావేశాన్ని జరపడం కోసం పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్లు వినవస్తుంది. (Story : షాడోయిజంపై తెలుగు తమ్ముళ్ల గరంగరం..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1